

క్రీడలు
క్రీడల వల్ల పిల్లలకు ఏవైనా లాభాలున్నాయా? అనే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తుంది. క్రీడలు పిల్లల జీవితాలలో ప్రధానపాత్ర పోషిస్తాయి. క్రీడల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. పిల్లలకు ప్లేగ్రౌండ్ ను అలవాటు చేయడం ఎంతో మంచిది. ఆరోగ్యంగా మీ పిల్లలు ఎదగాలని మీరనుకుంటే కచ్చితంగా మీ పిల్లలకు క్రీడలను అలవాటు చేయాలి. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఎదిగేందుకు ఆటలు ఉపయోగపడుతాయి. మీ పిల్లలను ఆటలకు దూరంగా ఉంచడమంటే వారిని అందమైన బాల్యం నుంచి దూరంగా ఉంచడమేనని అర్థం చేసుకోండి. ఈ రోజులలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి . చాలా పాఠశాలల్లో అసలు ప్లే గ్రౌండ్స్ లేవు. ఇది చాలా విచారించదగిన విషయం. మీరు ఒక మంచి తల్లిదండ్రులుగా పిల్లలకు ఆటల వల్ల కలిగే ప్రయోజనాలను గుర్తించి, వారిని ప్రోత్సహించడం ఎంతో ముఖ్యం. తద్వారా పిల్లలు చదువులో కూడా ఎంతో చురుకుగా ఉంటారు. సర్వేల ప్రకారం ఆటల్లో పాల్గొనే పిల్లలు చురుగ్గా ఉంటారు. అన్ని విషయాల్లోను చురుగ్గా ఉంటారు.
Social skills - అనేవి ఎంతో ముఖ్యమైన విషయం. పిల్లలు ఆటల్లో పాల్గొనడం వల్ల మిగతా పిల్లలతో కలిసి వారితో interact అవ్వడం వల్ల ఈ skills ను పెంపొందించుకుంటారు.
క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఏకాగ్రతను పెంపొందించుకుంటారు. క్రీడలు అనేవి మనిషి ఆరోగ్యంగా మరియు మానసికంగా ఎదగడానికి ఉపయోగపడతాయి.
అలాంటి ఆటలు ఆడుకోవడానికి విశాలమైన ఆటస్థలం మా Hi-tech school నందు కలదు.
ఈ పోటీ ప్రపంచంలో కేవలం చిన్న చిన్న గదులలో ప్లే గ్రౌండ్ లేకుండా ఎన్నో స్కూల్స్ ఉన్నాయి. అలాంటి ఈ రోజుల్లో అన్ని వసతులతో కలిగి విశాలమైన ఆట స్థలం లో మీ పిల్లలు ఉన్నతమైన విద్యతో పాటు మానసిక వికాసాన్ని కూడా పొందుతారు. కాబట్టి విద్యతో పాటు అన్ని రకాల క్రీడలు పిల్లలకు అవసరం .అందువల్ల ప్రశాంతమైన వాతావరణం తో కూడిన అన్ని విధాల అనుకూల మైనటువంటి School మా Hi-tech Scholars Residential High School.